May 23, 2019

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ..

చిత్తూరు / సోమల : సోమల మండలంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గంగిరెడ్డిపురం గ్రామంలో శనివారం తెలుగుదేశం నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వైఎస్సార్‌సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారాకనాథరెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఇరికిపెంట పంచాయతీలో గంగిరెడ్డిపురం టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇటీవల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా పలు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *