కోహ్లి పోరాటం వృథా.. విండీస్‌దే విజయం

 వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(107: 119 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాట్స్‌మన్‌ సహకారం అందించకపోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. విండీస్‌ బౌలర్లు మార్లోన్‌ శామ్యూల్స్‌ మూడు , హోల్డర్‌, మెక్‌కాయ్‌, అశ్లేనర్స్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో విండీస్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *