8 నిమిషాలు 60 కోట్లు!

సన్నివేశాల ప్రాముఖ్యతను బట్టి కొన్ని సార్లు భారీగా ఖర్చు పెడుతుంటారు. ‘సైరా: నర సింహా రెడ్డి’ క్లైమాక్స్‌ భాగానికి కూడా సుమారు 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట చిత్రబృందం. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా: నరసింహా రెడ్డి’. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

అక్కడ చిత్రీకరిస్తున్న యుద్ధ సన్నివేశాలు సుమారు 8 నిమిషాల పాటు ఉంటాయని సమాచారం. దీని కోసం ఏకంగా 60 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారట. చిరంజీవి, జగపతిబాబు, సుదీప్‌ మరికొందరు నటీనటులు ఈ షూటింలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ఈ భారీ క్లైమాక్స్‌ పోర్షన్‌లో 600 మంది జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ పాల్గొంటున్నారట. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీత దర్శకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *