June 25, 2019

మామను ఓడించమని హరీశ్‌ ఫోన్‌ చేశారు

గజ్వేల్‌: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి టచ్‌లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌లో ఆయనకు సముచిత గుర్తింపు లేదని.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధపడుతున్నారని, అంతేకాకుండా మామ కేసీఆర్‌ను ఓడించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నరాత్రి హరీశ్‌రావు నాకు అన్‌నోన్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిండు.. నువ్వేమన్నా కష్టపడు, మా మామ కేసీఆర్‌ను ఓడించు.. కావాలంటే ఆర్థికంగా సాయం జేస్తా… మా మామ ఉంటే నా రాజకీయ జీవితం ఉండదు. అన్నీ కేటీఆర్‌కు అప్పజెప్తుండు. పార్టీలో నా ఇజ్జత్‌ తీస్తుండు’అంటూ చెప్పారని పేర్కొన్నారు. ‘పద్నాలుగేండ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. గ్లాసులు కడిగినా.. చివరకు నాకు గుర్తింపు లేదు..’అంటూ వాపోయారని అన్నారు. ‘నేను కూడా నీవెంటే వస్తా’అంటూ భరోసా ఇచ్చారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *