నెల్లూరు రూరల్ కు పోటీ చేస్తున్నా

నెల్లూరు రూరల్ కు పోటీ చేస్తున్నా

మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం ముఖ్యమంత్రితో మంత్రులు నారాయణ అమర్నాథరెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు బీద రవిచంద్ర తో పాటు కలిసి సమావేశంలో పాల్గొన్నామన్నారు. ఆయన జిల్లాలోని సమస్యల గురించి వాటి పరిష్కారాలకు చేస్తున్న కృషిని గురించి అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులుగా నెల్లూరు నగరానికి మంత్రి నారాయణ ను నెల్లూరు రూరల్ కు నన్ను సర్వేపల్లి నియోజకవర్గానికి మంత్రి సోమిరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారని తెలిపారు ఆయన నిర్ణయాన్ని నేను స్వాగతించా మని చెప్పారు త్వరలో మిగతా నియోజకవర్గాలను కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిపారు గత నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని సీఎం చంద్రబాబు కు హామీ ఇచ్చామని చెప్పారు ఆ ప్రకారం కార్యకర్తలు నాయకులను కలుపుకుని గెలిచేందుకు కృషి చేస్తా మన్నారు మొదట నెల్లూరు నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రతిపాదించినప్పటికీ ప్రస్తుత పరిస్థితి పరిస్తితి కి అనుగుణంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించారన్నారు నెల్లూరు రూరల్ లో వైసీపీ నేతలు వారిని చూసి భయపడుతున్న టు ప్రచారం చేశారని ,దాదాపు ఏకగ్రీవంగా గెలుస్టున్నట్లు విపరీతమైన ప్రచారం మొదలు పెట్టారని తెలిపారు. అందుక నే ఇక్కడ పోటీ చేయాలనే ఇక్కడ పెడితే బాగుంటుందని ఉద్దేశానికి వచ్చానన్నారు గత రెండు సార్లు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయనప్పటికీ ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చేశామని ఓటు అడిగే హక్కు తమకుందన్నారు ప్రజలు కూడా మమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం అని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలాంటి భయాలు అనుమానాలు లేవని చెప్పారు కుట్రపూరిత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇలాంటి వాటికి తావు లేదని చెప్పారు మీడియా సమావేశంలో జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కంభం విజయ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *